ముగించు

ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం

వర్గం ఇతర

అలిపిరి-జూ పార్క్ రోడ్‌లో తిరుమల పాదాల వద్ద ఉన్న ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం, తిరుపతి (ఆర్.ఎస్.సి.టి), అన్ని వర్గాలకు చెందిన ప్రజల కోసం ఒక కార్యాచరణ ఆధారిత అనధికారిక విద్యా గమ్యస్థానంగా ఉంది.ఈ కేంద్రంలో 6 శాశ్వత ప్రదర్శన గ్యాలరీలు ఉన్నాయి: ‘ఫన్ సైన్స్’, ‘పాపులర్ సైన్స్’, ‘అవర్ యూనివర్స్’, ‘అవర్ సెన్సెస్’, ‘ఇల్యూజన్’ మరియు ‘ఎమర్జింగ్ టెక్నాలజీ’. 5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న పచ్చని పచ్చిక బయళ్లతో కూడిన ఆర్.ఎస్.సి.టి యొక్క అవుట్‌డోర్ సైన్స్ పార్క్, అనేక పార్టిసిపేటరీ ఎగ్జిబిట్‌లు, చరిత్రపూర్వ లైఫ్ పార్క్, హెర్బల్ గార్డెన్ & యానిమల్ కార్నర్‌లను కలిగి ఉంది. ఈ కేంద్రం ప్రశాంతమైన వాతావరణంలో అనుభవ ఆధారిత సైన్స్ లెర్నింగ్‌ను అందిస్తుంది. 3డి థియేటర్, సైన్స్ షోలు మరియు తారామండల్ సెంటర్‌లో ప్రత్యేకంగా విద్యార్థులకు ఆర్.ఎస్.సి.టి యొక్క మరికొన్ని ప్రధాన ఆకర్షణలు. ఈ కేంద్రం ఏడాది పొడవునా అనేక విద్యా విస్తరణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.రీజనల్ సైన్స్ సెంటర్, తిరుపతి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (ఎన్.సి.ఎస్.ఎమ్) యొక్క ఒక కాన్‌స్టిట్యూయెంట్ యూనిట్,

 ఇది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారతదేశ ప్రభుత్వం యొక్క మరియు నేరుగా విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్  మ్యూజియం, బెంగుళూరు పరిపాలనా నియంత్రణలో ఉంది. ఆర్.ఎస్.సి.టి ని సెప్టెంబరు 23, 1993న అప్పటి గౌరవనీయ భారత రాష్ట్రపతి  డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ జాతికి అంకితం చేశారు.

ఎలా చేరుకోవాలి? :

రోడ్డు ద్వారా

తిరుపతి నుండి రీజనల్ సైన్స్ సెంటర్ 6.2 కి. మీ