జిల్లా రవాణా శాఖ
ప్రొఫైల్
జిల్లా రవాణాశాఖాధికారి కార్యాలయము, రవాణా, రహదారులు మరియు భవనాల మంత్రిత్వ శాఖ(ఆర్ అండ్ బి) మరియు ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖ మోటారు వాహనాల చట్టం 1988 మరియు ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల పన్నుల చట్టం 1963 యొక్క నిబంధనల ప్రకారం క్రమబద్దీకరించడానికి బాధ్యత వహించే ఒక కీలక ప్రభుత్వసంస్థ. మోటార్ వాహనాల నిబంధనలను అమలు చేయటం మరియు వాహన సంభందిత ప్రజా సేవలను జిల్లా స్టాయిలో అందిచడానికి ఈ శాఖ బాధ్యత వహిస్తుంది . ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి జిల్లాలో కార్యాలయం జిల్లా రవాణా శాఖాధికారిపర్యవేక్షణలో వుంటుంది.
విధులు
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాలను సాధించడం, రాష్ట్ర వ్యాప్తంగా రహదారి భద్రతను పెంపొందించే చర్యలను అమలు చేయడం ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖ ప్రధాన భాద్యత.
రవాణా శాఖ కీలక విధులు
1. వాహన రిజిస్ట్రేషన్స్
-
- కొత్త వాహన రిజిస్ట్రేషన్స్ ( ఆర్. సి జారీ )
- యాజమాన్య బదిలీ
- డూప్లికేట్ ఆర్. సి. జారీ
- వాహన తనఖా రుణం ఆమోదం మరియు తొలగింపు.
2. డ్రైవింగ్ లైసెన్సులు
-
- లెర్నింగ్ మరియు శాశ్వత డ్రైవింగ్ లైసెన్సుల జారీ
- డూప్లికేట్ లైసెన్సుల మరియు పునరుద్దరుణ జారీ
- డ్రైవింగ్ పరీక్షల నిర్వహణ
3. వాహన తనిఖీ మరియు సామర్థ్య పరీక్ష
-
- రవాణా వాహనాల యొక్క క్రమానుగత తనిఖీ
- వాణిజ్య వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ
- కాలుష్య నియంత్రణ నిబంధనలు
4. పన్ను వసూలు
-
- వాహన పన్ను మరియు ఇతర రుసుముల వసూలు
- పన్ను ఎగవేతలపై నిఘా విభాగాల తనిఖీలు
5. ట్రాఫిక్ నిబంధనల అమలు
-
- మోటార్ వాహన చట్టాలు, ఆ ట్రాఫిక్ నిభందనల అమలు
- చట్టాలను ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేయటం లేదా జరిమానా విధించటం
6. అనుమతుల జారీ
-
- రవాణా వాహనాలకు జాతీయ, రాష్ట్ర పర్మిట్లు
- పాసెంజర్ గూడ్స్ వాహనాలకు ప్రత్యేక పర్మిట్లు
- సి ఎన్ జి /ఎల్ పి జి / ఎలెక్ట్రిక్ వాహనముల ఆమోదాలు
- పునరుద్ధరణ అనుమతులు మరియు తనిఖీ
7. ప్రజా ఫిర్యాదులు
వాహనం మరియు రవాణాకు సంబంధించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం
సంస్థ నిర్వహణ

పథకం / కార్యకలాపాలు / కార్యాచరణ ప్రణాళిక
కేంద్ర, రాష్ట్ర రవాణా శాఖలచే అమలు చేయబడే వివిధ పథకాలు మరియు కార్యక్రమాలకు అనుగుణంగా రవాణా శాఖ విధులు నిర్వర్తిస్తుంది. ఈ పథకాలు రహదారి భద్రత, కాలుష్య నియంత్రణ , డిజిటలైసెషన్ , ప్రజా సౌలభ్యము మరియు మెరుగైన అమలు పై దృష్టి పెడతాయి .
1. రహదారి భద్రత మరియు అవగాహన
తిరుపతి జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జరుపబడుతుంది . ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర /జాతీయ రహదారుల పై ప్రమాదాల తగ్గింపు పై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.
2. రాష్ట్ర రోడ్డు భద్రత ప్రణాళిక కార్యకలాపాలు
-
- పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ ప్రదేశాలలో రహదారి భద్రత పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం.
- హెల్మెట్ / సీట్ బెల్ట్ అవగాహన కోసం స్వచ్చంద సంస్థలతో కలిసి పని చేయటం.
- రహదారి భద్రత మాసోత్స వాలు నిర్వహించడం.
డిజిటల్ ఇండియా మరియు ఈ-గవర్నెన్స్ : చేర్చబడిన నూతన పథకాలు
-
వాహన్ 4.0 మరియు సారథి 4.0 యొక్క కార్యకలాపాలు
- ఆన్లైన్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ అమలు
- కాంటాక్ట్ లెస్ సేవలు ప్రోత్సహించటం ( ఇ – చలాన్, ఇ – పేమెంట్ )
- డిజిటల్ ప్లాట్ ఫారం లను ఉపయోగించటం లో ఆర్. టి. ఓ. సిబ్బందికి మరియు ప్రజలకు శిక్షణ
-
కాలుష్య నియంత్రణ : ఇమిడి వున్న పథకాలు
- నేషనల్ ఎలెక్ట్రిక్ మొబిలిటీ మిషన్ (ఎలెక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించటానికి )
- ఇంధన వుద్గార నిభంధనలు ( బి ఎస్ – 6 )
- పొల్యూషన్ అండర్ కంట్రోల్ ( పి యు సి ) సర్టిఫికేషన్ ప్రోగ్రామ్
-
కార్యకలాపాలు
- అన్నీ వాహనాలకు పి యు సి తనీఖీలను కఠినంగా అమలు చేయటం
- ఎలెక్ట్రిక్ వాహనాల ( ఇ . వి ) రిజిస్ట్రేషన్లను ప్రోత్సహించటం
- పొల్యూషన్ కంట్రోల్ బోర్డులతో కలసి పని చేయటం
-
వాహన ఫిట్నెస్ మరియు తనిఖీ
- ఆటోమేటెడ్ వెహికల్ టెస్టింగ్ స్టేషన్ లు
-
ఫిట్నెస్ సర్టిఫికేషన్ ఆధునీకరణ పథకం : కార్యకలాపాలు
- వాణిజ్య వాహనాల రెగ్యులర్ ఫిట్నెస్ సర్టిఫికేషన్.
- ఆటోమేటెడ్ ఫిట్నెస్ సెంటర్లను ప్రోత్సహించటం.
-
అనుమతి మరియు పన్ను సంస్కరణలు : ఇమిడి వున్న పథకాలు
- నేషనల్ పర్మిట్ స్కీమ్
- వన్ నేషన్ వన్ టాక్స్ ( రోడ్డు టాక్స్ సంస్కరణలు )
కార్యకలాపాలు
-
-
- జాతీయ / రాష్ట్ర అనుమతుల జారీ సజావుగా జరిగేలా చూడటం.
- పన్ను వసూళ్లకు డిజిటల్ వ్యవస్థల వినియోగం
-
-
డ్రైవింగ్ లైసెన్స్ లు : ఇమిడి వున్న పథకాలు : ఎ డి టి టి (ఆటోమేట్ డ్రైవింగ్ టెస్ట్ ) : కార్యకలాపాలు:
ఆటో మేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ మానవ తప్పిదాలు మరియు పక్ష పాతాన్ని తగ్గించటానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటం ద్వారా డ్రైవింగ్ మదింపుల ఖచ్చితత్వాన్ని మరియు నిష్పాక్షితను గణనీయంగా పెంచుతాయి.
-
వాహనాల సంఖ్య
తిరుపతి జిల్లా రవాణా శాఖ పరిధిలో 31-05-2025 నాటికి వాహనాల సంఖ్య 8,19,625 గా వుంది.
రవాణేతర వాహనాలు ( మోటార్ కార్, మోటార్ సైకిల్ , వాణిజ్యపరమైన ట్రాక్టర్లు మరియు వ్యవసాయ వినియోగ పరమైన ట్రాక్టర్ లు) : 7,08,079
రవాణా ( స్టేజ్ క్యారేజ్ మరియు కాంట్రాక్ట్ క్యారేజ్ లు, అంబులెన్స్, ఆటో రిక్షా, ఇ. రిక్షా , గూడ్స్ క్యారేజ్ లు, మ్యాక్ సీ క్యాబ్, మోటార్ క్యాబ్ , లగ్జరీ టూరిస్ట్ క్యాబ్ మరియు ప్రైవేట్ సర్విస్ వాహనాలు , వాణిజ్య అవసరాలకు ఇతరులకు సరిపోయేలా : 1,11,546
కాంటాక్ట్స్
| క్రమ సంఖ్య | అధికాÔ పేరు | హోదా | డివిజన్ / మండల్ జత చేయబడినది | ఫోన్ నెంబర్ |
|---|---|---|---|---|
| 1 | కె. మురళీ మోహన్ | జిల్లా రవాణా అధికారి | తిరుపతి | 9848528360 |
| 2 | బి. ఎస్. కె. కిషోర్ కుమార్ | రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ | గూడూరు | 9848261105 |
| 3 | బి. దామోదర్ నాయుడు | మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ | శ్రీకాళహస్తి | 9848528582 |
| 4 | పి. చంద్ర శేఖర్ | మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ | పుత్తూరు | 9652456655 |
| 5 | బి. అనిల్ కుమార్ | మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ | సూళ్ళూరు పేట | 9848814661 |
మెయిల్ మరియు పోస్టల్ చిరునామా
| క్రమ సంఖ్య | అధికారి పేరు | ఇ . మెయిల్ | పోస్టల్ చిరునామా |
|---|---|---|---|
| 1 | జిల్లా రవాణా అధికారి, తిరుపతి | dto[underscore]tirupati[at]aptransport[dot]org | కరకంబాడీ రోడ్డు , మంగళం, తిరుపతి , పిన్ కోడ్ 517507 |
| 2 | ప్రాంతీయ రవాణా అధికారి గూడూరు. | rto[underscore]gudur[at]aptransport[dot]org | పోటు పాలెం రోడ్డు, దివ్య ఫంక్షన్ హాల్ దగ్గర, చిల్లకూరు, గూడూరు పిన్ కోడ్ : 524412 |
ముఖ్య మైన వెబ్ సైట్ లింకులు
సారథి పరివాహన్ :
డ్రైవింగ్ లైసెన్స్ లు మరియు కండక్టర్ లైసెన్స్ లకు సంబంధించిన అన్నీ సేవలు సారథి పరివాహన్ ద్వారా జారీ చేయబడతాయి.
వెబ్ సైటు లింకు :
http://sarathi.Parivahan.gov.in