ముగించు

వ్యవసాయ శాఖ

ప్రొఫైల్

                 రాష్ట్రంలో జిల్లాల విభజన ఫలితంగా (జిఓ నం: 113 రెవెన్యూ (భూములు-iv) 26/01/2022న) కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో వ్యవసాయ శాఖ 04/04/2022 నుండి పనిచేయడం ప్రారంభించింది. అందుబాటులో ఉన్న వనరులు మరియు మానవ శక్తిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం మరియు అన్ని పథకాలను రైతుల ఇంటి వద్దకే అందించడం ద్వారా రైతు సాధికారత అనే ఉమ్మడి లక్ష్యం వైపు పనిచేయడం ఈ శాఖ ప్రధాన ఉద్దేశ్యం.

                తిరుపతి జిల్లాను నేల రకం, వర్షపాతం మరియు ఎత్తు ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ వ్యవసాయ-వాతావరణ మండలంగా వర్గీకరించారు. జిల్లాలో 8 వ్యవసాయ ఉపవిభాగాలు, 34 మండలాలు, 1051 రెవెన్యూ గ్రామాలు మరియు 784 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

                నేల స్వరూపం ఆధారంగా, జిల్లాలోని నేలల్లో 55% ఇసుక కలిగిన బంక గరప నేలలు ప్రధానంగా ఉన్నాయి, 32% ఇసుక గరప నేలలు మరియు 13% బంక గరప నేలలు ఉన్నాయి.

               సాగు విస్తీర్ణంలో ఎక్కువ భాగం కాలువలు, ట్యాంకులు, బావులు మరియు బోర్ బావుల కిందకు రావడంతో ప్రధాన పంటగా వరిని సాగు చేస్తారు . వర్షాధార వ్యవసాయ భూములలో వేరుశనగ ప్రధాన పంటగా సాగు చేస్తారు. కాలువలు, ట్యాంకులు, బావులు మరియు బోర్ బావుల కింద వరితో రెండు పంటల విధానాన్ని పాటిస్తారు. వరి మరియు వేరుశనగ తర్వాత చెరకు, మినుములు మరియు సజ్జలు తదుపరి స్థానంలో ఉన్నాయి. జిల్లాలో పొద్దుతిరుగుడు మరియు నువ్వుల విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది.

              జిల్లాలోని ప్రధాన నీటిపారుదల మూలం తెలుగు గంగ ప్రాజెక్ట్ కాలువ, ఇది కండలేరు రిజర్వాయర్ నుండి జిల్లాలోని 17 మండలాల్లోని ట్యాంకులు & బోర్‌ బావుల సాగు నీటిని అందిస్తుంది మరియు మూడు మధ్య తరహా నీటిపారుదల వనరుల ప్రాజెక్టులు అంటే అరణియార్, కాళంగి & మల్లెమడుగు రిజర్వాయర్‌లు సాగునీటిని అందిస్తాయి.

భూ వినియోగ వివరాలు – 2023-24
క్ర.సం. వర్గం విస్తీర్ణం(హె)
1 మొత్తం భౌగోళిక ప్రాంతం 822940
2 అడవులు 271318
3 బంజరు మరియు సాగుకు పనికిరాని భూమి 51035
4 వ్యవసాయేతర ఉపయోగాలకు ఉపయోగించిన భూమి 182118
5 సాగు చేయగల బీడు భూములు 24849
6 శాశ్వత పచ్చిక బయళ్ళు మరియు ఇతర మేత భూములు 20248
7 వివిధ రకాల చెట్ల పంటలు & తోటలు సాగు చేసే భూమి (విత్తిన నికర విస్తీర్ణంలో చేర్చలేదు). 10845
8 ప్రస్తుత బీడు భూములు 75669
9 ఇతర బీడు భూములు 48596
10 నికర సాగు విస్తీర్ణము 134739
11 స్థూలంగా పండించిన విస్తీర్ణము 148084
12 ఒకటి కంటే ఎక్కువసార్లు విత్తిన విస్తీర్ణము 13345
13 Fish & Prawn Culture 3523

  ప్రధాన లక్ష్యం

  • ఎరువులు, విత్తనాలు మరియు పురుగుమందుల వంటి ఇన్‌పుట్‌లపై నాణ్యతా నియంత్రణను అమలు చేయడం ప్రాథమిక లక్ష్యం.
  • రైతులకు సాగు కోసం సకాలంలో ఉత్పాదకాలను అందించడం.
  • రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కలిగించడం.
  • రైతులకు అవసరమైన విజ్ఞానం, నైపుణ్యాలు మరియు కొత్త పద్ధతులను అందించడం (నానో ఎరువుల వాడకం, HYV, IPM మరియు INM పద్ధతులు, డ్రోన్ వ్యవసాయం మొదలైనవి)
  • వ్యవసాయంలో డిజిటల్ టెక్నాలజీ పట్ల రైతులకు అవగాహన కల్పించడం.
  • PMDS మరియు ATM నమూనాలను అమలు చేసే కమ్యూనిటీ ఆధారిత సహజ వ్యవసాయంపై కూడా ఈ శాఖ దృష్టి సారించింది మరియు మార్కెట్లో మంచి ధర పొందడానికి నాణ్యమైన ఉత్పత్తిని పెంచడానికి సేంద్రీయ ధృవీకరణ వైపు రైతులను ప్రోత్సహిస్తోంది.

సంస్థ నిర్మాణం

సంస్థ నిర్మాణం

 

రైతు సేవా కేంద్రాలు (RSK)

రైతు సేవా కేంద్రాలు

                  జిల్లా అంతటా 445 రైతు సేవా కేంద్రాలు స్థాపించబడ్డాయి మరియు మే 2020 నుండి పనిచేస్తున్నాయి మరియు వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు “విత్తనం నుండి అమ్మకం వరకు” నిరంతర సేవలను గ్రామ స్థాయిలో పారదర్శకంగా అందిస్తున్నాయి. RSK అనేది ప్రభుత్వం ధృవీకరించిన వ్యవసాయ ఉత్పాదకాలు  (విత్తనాలు, ఎరువులు & పురుగు మందులు), పశుసంవర్ధక & మత్స్య శాఖల ఉత్పాదకాలను రైతులకు సరఫరా చేయడానికి వన్-స్టాప్ షాప్ మరియు రైతులకు శాస్త్రీయ వ్యవసాయ సలహాలను అందించడానికి అనుబంధ వర్క్‌షాప్/నాలెడ్జ్ సెంటర్‌ను కలిగి ఉంటుంది.

ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లు

ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లు                  రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలు- విత్తనాలు, ఎరువులు & పురుగుమందులు అందేలా చూడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లు స్థాపించబడ్డాయి.

                 చంద్రగిరి, శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి, సత్యవేడు మరియు సూళ్లూరుపేట లలో ఆరు నియోజకవర్గ స్థాయి ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. ADA (రెగ్యులర్) (ఎవరి అధికార పరిధిలో నియోజకవర్గ స్థాయి ల్యాబ్ ఉందో) వారి పర్యవేక్షణ లో పనిచేస్తుంది.. ADA (రెగ్యులర్) కు ఒక AO మరియు ఇద్దరు AEO  లు సహాయకులుగా వుంటారు. ఈ ల్యాబ్‌లు రైతులు సమర్పించిన నమూనాలను విశ్లేషించి ఫలితాలను తెలియజేస్తాయి మరియు ప్రాంతీయ కోడింగ్ కేంద్రాల నుండి పంపిన నమూనాలను కూడా విశ్లేషిస్తాయి. MAOలు వారి అధికార పరిధిలోని సేవా నమూనాలను తీసుకొని ఈ ల్యాబ్‌లలో వాటిని విశ్లేషించవచ్చు. ఇన్‌పుట్ డీలర్లు కూడా చెల్లింపు ఆధారంగా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లలో వారి వ్యవసాయ ఇన్‌పుట్‌లను విశ్లేషించవచ్చు.

ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లు

జిల్లా వనరుల కేంద్రం

                   జిల్లా వనరుల కేంద్రం (DRC) అనేది జిల్లాలోని వ్యవసాయ శాఖకు సంబంధించిన విజ్ఞానం మరియు మానవ వనరుల అభివృద్ధి కేంద్రం. DRCకి ఒక జిల్లా శిక్షణ సమన్వయకర్త నాయకత్వం వహిస్తారు, దీనికి ADA, ముగ్గురు వ్యవసాయ అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది మద్దతు ఇస్తారు.

  • జిల్లాలో పనిచేస్తున్న రైతులు మరియు గ్రామ స్థాయి విస్తరణ కార్యకర్తల శిక్షణ మరియు సామర్థ్య నిర్మాణ అవసరాలను DRC తీరుస్తుంది.
  • డిపార్ట్‌మెంటల్ కార్యక్రమాలతో పాటు, DRC ATMA రైతులకు శిక్షణలు, KVK, DATT కేంద్ర శాస్త్రవేత్తలతో క్షేత్ర విశ్లేషణ సందర్శనలు, రైతులకు తక్షణ వ్యవసాయ సలహాలు అందించడం, క్షేత్ర ప్రదర్శన, రైతులకు ఎక్స్‌పోజర్ సందర్శనలు మరియు పొలంబాడి తనిఖీలను కూడా నిర్వహిస్తుంది.
  • పంట కాలంలో, విస్తరణ కార్యకర్తలకు DRC క్రమం తప్పకుండా అవసరాల ఆధారిత వర్చువల్ శిక్షణలను నిర్వహిస్తుంది మరియు ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా ద్వారా పంట సలహాలను కూడా అందిస్తుంది.
  • DRC క్రమం తప్పకుండా వ్యవసాయ ప్రదర్శనలను ఏర్పాటు చేస్తుంది మరియు అన్ని ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలు మరియు వేడుకలలో చురుకుగా పాల్గొంటుంది మరియు వ్యవసాయం మరియు అనుబంధ విభాగాల వివిధ శిక్షణా కార్యక్రమాలకు వనరుల వ్యక్తులను కూడా ఏర్పాటు చేస్తుంది.

భూసార పరీక్షా కేంద్రం

                  వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని భూసార పరీక్షా కేంద్రం తిరుపతిలోని RARS క్యాంపస్ ప్రాంగణంలో ఉంది, ఇది సాయిల్ హెల్త్ కార్డ్ (SHC) కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి స్థాపించబడింది. రైతుల పొలాల నుండి సేకరించిన మరియు మండల వ్యవసాయ అధికారుల ద్వారా స్వీకరించబడిన మట్టి నమూనాలను భౌతిక లక్షణాలు, pH, EC, ప్రధాన పోషకాలు (N, P, K), ద్వితీయ పోషకాలు (సల్ఫర్) మరియు సూక్ష్మ పోషకాలు (Zn, Fe, Cu, Mn మరియు బోరాన్) విశ్లేషిస్తారు మరియు సమస్యాత్మక నేలలను కూడా గుర్తిస్తారు. విశ్లేషణ తర్వాత రైతులకు పంపిణీ చేయడానికి సాయిల్ హెల్త్ కార్డులను పోర్టల్ లో నమోదు చేయటం జరుగుతుంది. పంటలకు సాగునీరు ఇవ్వడానికి అనుకూలత కోసం నీటి నమూనాల విశ్లేషణ కూడా జరుగుతుంది. రైతులు మట్టి మరియు నీటి నమూనాల విశ్లేషణ కోసం నేరుగా సంప్రదించవచ్చు.

భూసార పరీక్షా కేంద్రం

నేల పరిరక్షణ విభాగం

                   నేల పరిరక్షణ విభాగం అనేది వ్యవసాయ శాఖ లోని ఒక విభాగం. నేల వనరులను రక్షించడం మరియు మెరుగుపరచటం ఈ విభాగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. నేల క్షీణతను నివారించడానికి, స్థిరమైన భూ నిర్వహణను ప్రోత్సహించడానికి మరియు వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి వాటర్‌షెడ్‌లను ప్రోత్సహించడానికి వివిధ నేల సంరక్షణ చర్యలను అమలు చేస్తారు . 

విత్తన ఉత్పత్తి క్షేత్రం, నాగలాపురం

                  విత్తన ఉత్పత్తి క్షేత్రం నాగ లాపురంలో ఉంది మరియు ఇది అవసరానికి అనుగుణంగా APSSDCL తో బై బ్యాక్ ఒప్పందం ప్రకారం ఫౌండేషన్ సీడ్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు జిల్లాలో సీడ్ విలేజ్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి రైతులకు నాణ్యమైన విత్తనాలను కూడా అందిస్తుంది.

విత్తన ఉత్పత్తి క్షేత్రం, నాగలాపురం

పథకాలు/కార్యకలాపాలు

భూసార పరీక్ష

                  భూసార స్థితిని అంచనా వేయడానికి మరియు సమస్యాత్మక నేలలను (క్షార/లవణ) గుర్తించడానికి, భూసారాన్ని మెరుగుపరచడానికి మరియు ఎరువుల సమతుల్య మరియు సమగ్ర వినియోగాన్ని పెంచటానికి , తద్వారా సాగు ఖర్చును తగ్గించడానికి మట్టి నమూనా సేకరణ మరియు భూసార పరీక్షా కార్యక్రమాన్ని ఒక క్రమపద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పథకం నేల ఆరోగ్యం & సంరక్షణ – RKVY కింద అమలు చేయబడుతుంది. ప్రతి మండలంలోని గ్రామాలలోని వ్యవసాయ కమతాల నుండి లక్ష్యాన్ని బట్టి మట్టి నమూనాలను సేకరించి, విశ్లేషణ తర్వాత, రైతులకు భూసార ఆరోగ్య కార్డులను పంపిణీ చేస్తారు. ఫలితాలు భూసార ఆరోగ్య కార్డు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయబడతాయి.

భూసార పరీక్ష

సబ్సిడీ విత్తనాల పంపిణీ

                  వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంలో విత్తనం కీలకమైనది. అధిక దిగుబడిని సాధించడంలో ధృవీకరించబడిన/నాణ్యత గల విత్తనం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సబ్సిడీపై విత్తనాల సరఫరా (పచ్చి రొట్ట  విత్తనాలు, వేరుశనగ, వరి, ఉలవలు, నువ్వులు) ద్వారా సన్నకారు రైతులు వ్యవసాయంలో అత్యంత కీలకమైన ఇన్పుట్‌ను సులభంగా కొనుగోలు చేయగలరు. 2020 ఖరీఫ్ సీజన్ నుండి ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా సబ్సిడీ విత్తనాల పంపిణీని వికేంద్రీకరించి, రైతు లకు ప్రయోజనం చేకూర్చేలా గ్రామ స్థాయికి తీసుకు వెళ్ళటం ద్వారా అవసరమైన విత్తనం రైతుల ఇంటికే చేరుతుంది. ధృవీకరించబడిన విత్తనాన్ని ప్రభుత్వం ఆమోదించిన సబ్సిడీపై విత్తన సరఫరా నోడల్ ఏజెన్సీ, APSSDCL, ద్వారా రైతులకు సరఫరా చేస్తారు. పారదర్శకతను కొనసాగించడానికి మరియు దుర్వినియోగం నివారించడానికి విత్తన పంపిణీలో ఆధార్ ఆధారిత బయో-మెట్రిక్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. తాజాగా విడుదల చేసిన అధిక దిగుబడినిచ్చే రకాలు/హైబ్రిడ్‌లను రైతులకు పరిచయం చేయడం మరియు ప్రాచుర్యం పెంపొందించే లక్ష్యంతో FNS-పప్పుధాన్యాలు, NFSM-OS పథకాల కింద విత్తన మినీకిట్‌లను కూడా శాఖ పంపిణీ చేస్తోంది.

సబ్సిడీ విత్తనాల పంపిణీ

ఎరువుల పంపిణీ

                  రైతుల ప్రయోజనం కోసం ఎరువుల పంపిణీని వికేంద్రీకరించి గ్రామ స్థాయికి తీసుకు వెళ్ళటం ద్వారా అవసరమైన ఎరువులు సరైన సమయంలో రైతుల ఇంటికే చేరుతాయి. PM PRANAM పథకం కింద, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు పంట దిగుబడిని పెంపొందించటానికి, సేంద్రీయ మరియు జీవ ఎరువులతో సహా వివిధ రకాల ఎరువుల వాడకాన్ని శాఖ ప్రోత్సహిస్తోంది మరియు వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు పురుగుమందుల అధిక వాడకాన్ని తగ్గించటానికి ప్రయత్నిస్తున్నది.

ఎరువుల పంపిణీ

నాణ్యత నియంత్రణ

                  నాణ్యమైన ఉత్పాదకాలను (విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు) రైతులకు  చేరటాన్ని దృష్టిలో ఉంచుకుని, ADAలు (రెగ్యులర్) మరియు మండల వ్యవసాయ అధికారులు ఇన్‌పుట్ షాపులను క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తారు మరియు మార్కెట్‌లోకి నకిలీ ఇన్‌పుట్‌ల ప్రవాహాన్ని తనిఖీ చేయడానికి నోటిఫైడ్ ప్రయోగశాలలలో విశ్లేషణ కోసం అన్ని ఇన్‌పుట్‌ల నమూనాలను తీసుకుంటారు. చట్టాలలో ఉన్న నిబంధనల ప్రకారం నాసిరకం నమూనాలపై చర్య తీసుకొన బడుతుంది.

అన్నదాత సుఖీభవ – PM కిసాన్ (ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి)

                  రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు, తద్వారా వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ- PM కిసాన్’ పథకాన్ని (Annadata Sukhibhava – PM KISAN Scheme) ప్రారంభించింది. చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఒక్కో రైతుకు ఏటా రూ. 20 వేలు అందించనున్నారు (PM కిసాన్ కింద GOI అందించే రూ.6000/- ప్రయోజనం ఇందులో ఉంది). మొత్తం 3 విడతలుగా ఈ మొత్తాన్ని రైతు ఖాతాలో జమ చేస్తారు.

                  రాష్ట్రంలోని భూమిలేని సాగుదారులందరికీ రాష్ట్ర బడ్జెట్ నుండి సంవత్సరానికి రూ.20000/- ఆర్థిక సహాయం అందించబడుతుంది.

వ్యవసాయ పంట ఋణాలు

                  వ్యవసాయోత్పత్తిని, ఉత్పాదకతను పెంచుటలో వ్యవసాయ ఋణాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇతర పెట్టుబడి సాధనాలతో పాటుగా వ్యవసాయాన్ని సుస్థిరం మరియు లాభదాయకం చేయుటకు వ్యవసాయ ఋణం పాత్ర ముఖ్యమైనది. చాలా కాలం వరకు వ్యవసాయ ఋణం, ప్రైవేటు ఋణదాతల చేతిలో ఉండేది, కాని వీరు ఇచ్చే ఋణం తగినంతగా లేకపోవడంవలన రైతులపై ఎక్కువ భారం పడుట, ఋణగ్రహీతలు దోపిడీకి గురి అవడం సాధారణంగా ఉండేది. ఈ స్థితిని మార్చుటకు సహకార సంఘాలు, వ్యాపార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మొదలగు సంస్థలు ఏర్పాటుచేయబడినవి. వీటి ద్వారా సమయానికి తగినంత ఋణంను తక్కువ వడ్డీకి రైతులకు అందించటం జరుగుతుంది. సన్నకారు రైతులకు చౌకైన, సకాలంలో మరియు తగినంత క్రెడిట్ (పంట రుణాలు & టర్మ్ రుణాలు) అందించడా న్ని లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది.

CCRCలు (పంట సాగుదారుల హక్కు పత్రం) :

                ఈ పత్రాలు కౌలు రైతులకు జారీ చేయబడతాయి, వీటిని భూ యజమాని మరియు సాగుదారు పరస్పర ఒప్పందంపై సంబంధిత VRO & తహశీల్దార్ సంతకం చేస్తారు. పంట సాగుదారుల హక్కు పత్రం ద్వారా 11 నెలల కాలానికి కౌలుదారు రైతులు పంటపై హక్కులను మరియు బ్యాంకుల నుండి పంట రుణాలు మరియు అన్నదాత సుఖీభవ, వడ్డీ లేని పంట రునాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, పంట బీమా & సేకరణ వంటి వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు అర్హులు.

వ్యవసాయ యాంత్రీకరణ:

                వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా వ్యవసాయ పనులను సులభతరం చేయడం ,మరింత సమర్థవంతంగా తక్కువ ఖర్చు తో చేయటం లో సహాయపడతాయి. అవి రైతులకు సహాయపడటమే కాకుండా, వ్యవసాయం యొక్క ఉత్పాదకతను పెంచుతాయి. SMAM పథకం కింద 2024-25 రబీ నుండి సబ్సిడీ ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లను వ్యవసాయ శాఖ వ్యక్తిగత రైతులకు పంపిణీ చేస్తోంది.

వ్యవసాయ యాంత్రీకరణ

కిసాన్ డ్రోన్లతో గ్రామ స్థాయి వ్యవసాయ యంత్ర బ్యాంకులు

                  కిసాన్ డ్రోన్లను పురుగుమందులు మరియు పోషకాలను పిచికారీ చేయడానికి ఉపయోగిస్తున్నారు . ప్రభుత్వం కిసాన్ డ్రోన్‌లతో గ్రామ స్థాయి వ్యవసాయ యంత్ర బ్యాంకులను ఏర్పాటు చేయడం ద్వారా డ్రోన్ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది, 80% సబ్సిడీని అందించడంతో పాటు ఎంపిక చేసిన పైలట్‌లకు శిక్షణ కూడా అందిస్తోంది.

కిసాన్ డ్రోన్లతో గ్రామ స్థాయి వ్యవసాయ యంత్ర బ్యాంకులు

పంట బీమా

  1. PMFBY- దిగుబడి ఆధారితం: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) అనేది భారత ప్రభుత్వం 2016 లో ప్రారంభించిన సమగ్ర పంట బీమా పథకం మరియు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయబడుతోంది. నోటిఫైడ్ పంటలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

           ఖరీఫ్ సీజన్ -వరి (VIU), సజ్జ (DIU)

           రబీ సీజన్ – వరి (VIU), వేరుశనగ (MIU), మామిడి (MIU)

  1. RWBCIS – వాతావరణ ఆధారితం: (పునఃనిర్మాణాత్మక వాతావరణ ఆధారిత పంట బీమా పథకం) అనేది PMFBYలో ఒక భాగం, ఇది వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలి వేగం మరియు తేమ వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడికి ప్రాక్సీలుగా రైతులకు పంట నష్టాలకు బీమా కవరేజీని అందించడానికి రూపొందించబడింది. ఖరీఫ్ సీజన్ కోసం నోటిఫై చేయబడిన పంటలు వేరుశనగ (MIU), నిమ్మ (MIU)

         ఈ పథకాన్ని పొందడానికి, రైతులు నిర్ణీత గడువులోపు అవసరమైన ప్రీమియం చెల్లించాలి మరియు విధానాల ప్రకారం అవసరమైన పత్రాలను సమర్పించాలి.

ఈ-పంట

                     వ్యవసాయం మరియు రెవెన్యూ శాఖల ద్వారా జాయింట్-అజ్మోయిష్ ద్వారా అన్ని భూమి పార్శిళ్లలో జియోఫెన్సింగ్ ద్వారా నిజమైన సాగుదారునికి ప్రయోజనం చేకూర్చేలా రైతుల వారీగా సాగు చేసిన పంట వివరాలను డిజిటల్‌గా రికార్డ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం డిజిటల్ ఈ-పంట. ఇది అన్ని రైతు సంక్షేమ కార్యక్రమాలు అంటే పంటల బీమా, MSP పంటల సేకరణలు, ఇన్‌పుట్ సబ్సిడీ మరియు పంట రుణాల ను పొందటానికి మూలంగా గుర్తించబడింది.

ఈ-పంట

ప్రకృతి వైపరీత్యాలు

                  తుఫాను/ భారీ వర్షాలు/ అకాల వర్షాలు/ కరువు/ వరదలు/ వడగళ్ల వాన వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందిస్తోంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టం జరిగిన బాధిత రైతులకు తక్షణ సహాయం అందించబడుతుంది. నష్టం 33 శాతం కంటే తక్కువగా ఉంటే, రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమైనప్పుడు/ పొడిగాలులు/ తుఫానులు/ వరదలు సంభవించినప్పుడు సబ్సిడీపై ప్రత్యామ్నాయ పంటల విత్తనాల సరఫరా కోసం వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేస్తుంది.

రైతు ఆత్మహత్యలకు ఆర్థిక సహాయం

                 వ్యవసాయ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్న ,మరణించిన రైతులు/ కౌలు రైతులకు వారి కుటుంబ సభ్యులకు 01.06.2019 తర్వాత నివేదించబడిన కేసులకు సంబంధించి రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి పునరావాస ప్యాకేజీగా రూ. 7.00 లక్షల ఆర్థిక సహాయం అందించ బడుతుంది.

                వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ (AP), గుంటూరు, జిఓ ఆర్.టి.నెం.102 వ్యవసాయ & సహకార శాఖ (AGRI.II) విభాగం తేదీ.14.10.2019 మరియు జిఓ Ms.No.43 వ్యవసాయ & సహకార శాఖ (AGRI.II). విభాగం తేదీ. 20.02.2020 ప్రకారం జిల్లా కలెక్టర్ వారి ద్వారా రూ. 7.00 లక్షల ఆర్థిక సహాయం అందించ బడుతుంది.

గ్రామ విత్తన పథకం:

                జిల్లాలో అమలు చేయబడుతున్న నేష నల్  మిషన్ ఆన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ & టెక్నాలజీ (NMAET) కింద సబ్-మిషన్ ఆన్ సీడ్స్ అండ్ ప్లాంటింగ్ మెటీరియల్స్ (SMSP)లో గ్రామ విత్తన పథకం (SVP) అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటి.

                వ్యవసాయ విత్తనాల నాణ్యతను మెరుగుపరచడానికి, విత్తన ప్రత్యామ్నాయ రేటును (SRR) పెంచడానికి మరియు పంటల ఉత్పాదకతను మెరుగుపరచడానికి రైతులలో అధిక దిగుబడినిచ్చే రకాలను సమాంతరంగా విస్తరించడం గ్రామ విత్తన పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. 

GAP-పొలంబడి :

                విత్తనం నుండి విత్తనం వరకు రైతులకు సమగ్ర పంట నిర్వహణపై 14 వారాల పాటు అవగాహన కల్పించడానికి మరియు పర్యావరణ అనుకూల సేంద్రీయ వ్యవసాయం ద్వారా పంట దిగుబడిని పెంచడానికి ప్రతి RSK గ్రామంలో శాస్త్రీయ పద్ధతిలో ANGRAU శాస్త్రవేత్తలు మరియు DRCల భాగస్వామ్యం తో ,నాణ్యత నియంత్రణ మరియు ప్రపంచ మార్కెట్ ను అందిపుచ్చు కోవటానికి, మెరుగైన పంట నాణ్యత మరియు రైతుల ఉత్పత్తులకు మెరుగైన ధర పొందటానికి GAP-పోలంబడి మరియు ఇండ్-గ్యాప్ సర్టిఫికేషన్ (మంచి వ్యవసాయ పద్ధతులు) అమలు చేస్తోంది.

               ఈ సర్టిఫికేషన్ స్థానిక రైతులు దేశీయ మరియు జాతీయ మార్కెట్లలో ప్రీమియం ధరలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఈ పథకాన్ని RKVY (60:40 కేంద్ర: రాష్ట్రం) నిధుల ద్వారా అమలు చేయటం జరుగుతోంది.

GAP-పొలంబడి

పొలం పిలుస్తోంది

               రైతుల ఇంటి వద్దకే వ్యవసాయ విస్తరణను తీసుకుని వెళ్ళటం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని వారంలో ప్రతి మంగళవారం మరియు బుధవారం అన్ని మండలాల్లో (రోజుకు 2 గ్రామాలు) వ్యవసాయ శాఖ, అనుబంధ విభాగాలు మరియు శాస్త్రవేత్తలు  మరియు ప్రజా ప్రతినిధులు కలిసి నిర్వహిస్తారు.

పొలం పిలుస్తోంది

NFSM-FNS -పప్పుధాన్యాలు మరియు పోషక-తృణధాన్యాలు

                  ఆహార పంటల విస్తీర్ణం మరియు ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రాయోజిత పథకం అయిన ఆహారం మరియు పోషకాహార భద్రతా మిషన్ 2007 అక్టోబర్‌లో ప్రారంభించబడింది. మెరుగైన సాంకేతికతలు మరియు వ్యవసాయ నిర్వహణ పద్ధతుల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం మరియు దేశంలో ఆహార భద్రతను నిర్ధారించడం ఈ పథకం లక్ష్యం. జిల్లాలోని FNS పథకం కింద సజ్జ మరియు మినుము పంటల లో క్లస్టర్ ప్రదర్శనలు నిర్వహించ బడుచున్నవి.

NMEO-OS :

                 NFSM-OS ను 2022-23 నుండి “కృ షోన్నతి యోజన” కింద NFSM మరియు ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలతో (CSS) కలిపి అమలు చేస్తారు. లక్ష్యం వెజిటబుల్ నూనెల లభ్యతను పెంచడం మరియు నూనెగింజల నుండి సేకరించిన వెజిటబుల్ నూనెల ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడం ద్వారా ఎడిబుల్ నూనెల దిగుమతిని తగ్గించడం ఈ పథక లక్ష్యం. జిల్లాలో వేరుశనగ మరియు పొద్దుతిరుగుడు పంటలలో క్లస్టర్ ప్రదర్శనలు నిర్వహించ బడుచున్నవి.

సామూహిక ఎలుకల నియంత్రణ కార్యక్రమం

                ఎలుకల జనాభాను నియంత్రించటం ద్వారా పంట నష్టాలను తగ్గించడం మరియు ఆహార ధాన్యాల నాణ్యతను మెరుగుపరచడం ఈ పథక లక్ష్యం. ఇది నిర్దిష్ట సీజన్లలో (ఖరీఫ్‌కు జూన్-సెప్టెంబర్, రబీకి అక్టోబర్-మార్చి) అమలు చేయబడుతుంది. ఈ కార్యక్రమం కింద ఎలుకల సంహారక రసాయనం, బ్రోమడియోలోన్ (0.25 శాతం CB) ఎలుకల ఉధృతి తీవ్రతను బట్టి హెక్టారుకు 8 నుండి 10 గ్రాముల చొప్పున 100% సబ్సిడీపై సామూహిక  నివారణ కొరకు రైతులకు పంపిణీ చేయబడుతుంది మరియు ప్రతిపాదిత గ్రామ ప్రాంతం మొత్తం కవర్ చేయబడుతుంది.

సామూహిక ఎలుకల నియంత్రణ కార్యక్రమం

APILIP

                 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 2017 నుండి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) సహాయంతో “ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అండ్ లైవ్లిహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ఫేజ్ -2(APILIP)” ను అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం స్థానిక ఉత్పాదకతను పెంచడం, ఇప్పటికే ఉన్న నీటిపారుదల వ్యవస్థలను పునరుద్ధరించడం ద్వారా సంస్థాగత మరియు మార్కెటింగ్ సామర్థ్యాలను బలోపేతం చేయడం, సమగ్ర వ్యవసాయ వ్యవస్థలకు మద్దతు ఇవ్వడం మరియు జిల్లాలోని ప్రాజెక్ట్ ప్రాంతంలోని రైతులు మరియు ఇతర గ్రామీణ వర్గాల జీవనోపాధి మెరుగుదలకు దోహదపడే విలువ గొలుసు అభివృద్ధి  చేయడం.

APIIATP:

                 ప్రపంచ బ్యాంకు సహాయంతో ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్‌ (APIIATP) ను వ్యవసాయ శాఖ జిల్లాలోని 27 గ్రామాల్లోని చెరువుల అమలు చేస్తోంది. APIIATP ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యాలు పంట వైవిధ్యీకరణ , మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు పొలంబాడి & క్లస్టర్ ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా రైతులకు శిక్షణ మరియు సామర్థ్య నిర్మాణాన్ని అందించడం ద్వారా పంట ఉత్పత్తిని పెంచడం.

ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ (APCNF)

ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్

                రసాయన రహిత మరియు పర్యావరణ అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, ప్రభుత్వం తిరుపతి జిల్లాలోని అనేక గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ (APCNF)ను విస్తరిస్తోంది. ఈ పథకం తక్కువ ఖర్చుతో కూడిన, పునరుత్పాదక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది మరియు రైతులు సింథటిక్ ఎరువులు మరియు పురుగుమందులకు దూరంగా ఉండేలా చేస్తుంది.

               2026 చివరి నాటికి మొత్తం సాగుభూమిని సహజ వ్యవసాయం కిందకు మార్చాలనే లక్ష్యంతో APCNF అమలు కోసం జిల్లాలో నారావారిపల్లి క్లస్టర్‌ను ప్రత్యేకంగా ఎంపిక చేయటం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్

సంప్రదించవలసిన వారి వివరములు

               మెయిల్ ఐడి        : agri[dot]daotpt[at]gmail[dot]com

                చిరునామా            : జిల్లా వ్యవసాయ అధికారి,

                                               రూమ్.నెం.609, B బ్లాక్,

                                               పద్మావతి నిలయం,

                                               O/o జిల్లా కలెక్టరేట్,

                                               తిరుపతి-517503.

               మొబైల్ నెం       : 8331057884

జిల్లా శిక్షణ సమన్వయకర్త – జిల్లా వనరుల కేంద్రం : మొబైల్ నెం: 8331057872

అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ – సాయిల్ టెస్టింగ్ ల్యాబ్, తిరుపతి : మొబైల్ నంబర్: 8331057881

అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ – సాయిల్ కన్జర్వేషన్, తిరుపతి : మొబైల్ నెం.8331057855

జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్, APCNF, తిరుపతి: మొబైల్ నంబర్: 8919388173

ప్రాంతీయ కోడింగ్ కేంద్రం, తిరుపతి: మొబైల్ నంబర్ 8331057883

జిల్లాలోని ఎడిఎ లు & ఎంఎఓ ల సంప్రదింపు నంబర్లు
క్ర.సంఖ్య. ఉప విభాగం ఎడిఎ/ఎంఎఓ మొబైల్ నంబర్
1 తిరుపతి సహాయ వ్యవసాయ సంచాలకులు, తిరుపతి 8331057753
2 మండల వ్యవసాయ అధికారి, తిరుపతి అర్బన్ 8331057842
3 మండల వ్యవసాయ అధికారి, తిరుపతి రూరల్ 8331057843
4 మండల వ్యవసాయ అధికారి, రేణిగుంట 8331057840
5 మండల వ్యవసాయ అధికారి, పాకాల 8331057838
6 మండల వ్యవసాయ అధికారి, చంద్రగిరి 8331057836
7 మండల వ్యవసాయ అధికారి, చిన్నగొట్టిగల్లు 8331057825
8 మండల వ్యవసాయ అధికారి, యెర్రవారిపాలెం 8331057826
9 పుత్తూరు సహాయ వ్యవసాయ సంచాలకులు, పుత్తూరు 8331057749
10 మండల వ్యవసాయ అధికారి, వడమాలపేట 8331057818
11 మండల వ్యవసాయ అధికారి, నారాయణవనం 8331057820
12 మండల వ్యవసాయ అధికారి, రామచంద్రపురం 8331057819
13 మండల వ్యవసాయ అధికారి, పుత్తూరు 8331057815
14 శ్రీకాళహస్తి సహాయ వ్యవసాయ సంచాలకులు, శ్రీకాళహస్తి 8331057754
15 మండల వ్యవసాయ అధికారి, శ్రీకాళహస్తి 8331057830
16 మండల వ్యవసాయ అధికారి, యేర్పేడు 8331057831
17 మండల వ్యవసాయ అధికారి, తొట్టంబేడు 8331057832
18 మండల వ్యవసాయ అధికారి, కెవిబిపురం 8331057833
19 మండల వ్యవసాయ అధికారి, బి.యన్.కండ్రిగ 8331057834
20 సత్యవేడు సహాయ వ్యవసాయ సంచాలకులు సత్యవేడు 8331057756
21 మండల వ్యవసాయ అధికారి, సత్యవేడు 8331057772
22 మండల వ్యవసాయ అధికారి, వరదయ్యపాళ్యం 8331057773
23 మండల వ్యవసాయ అధికారి, నాగలపురం 8331057774
24 మండల వ్యవసాయ అధికారి, పిచాటూర్ 8331057775
25 గూడూరు సహాయ వ్యవసాయ సంచాలకులు, గూడూరు 8331057199
26 మండల వ్యవసాయ అధికారి, గూడూరు 8331057265
27 మండల వ్యవసాయ అధికారి, ఓజిలి 8331057268
28 మండల వ్యవసాయ అధికారి చిల్లకూరు 8331057267
29 నాయుడుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు, నాయుడుపేట 8331057200
30 మండల వ్యవసాయ అధికారి, నాయుడుపేట 8331057270
31 మండల వ్యవసాయ అధికారి, వాకడు 8331057275
32 మండల వ్యవసాయ అధికారి, చిట్టమూరు 8331057274
33 మండల వ్యవసాయ అధికారి, పెళ్లకూరు 8331057271
34 మండల వ్యవసాయ అధికారి, కోట 8331057276
35 సూళ్లూరుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు,సూళ్లూరుపేట 8331057201
36 మండల వ్యవసాయ అధికారి, సూళ్లూరుపేట 8331057277
37 మండల వ్యవసాయ అధికారి, డివి సత్రం 8331057278
38 మండల వ్యవసాయ అధికారి ,త డ 8331057279
39 వెంకటగిరి సహాయ వ్యవసాయ సంచాలకులు వెంకటగిరి 8331057202
40 మండల వ్యవసాయ అధికారి, వెంకటగిరి, 8331057280
41 మండల వ్యవసాయ అధికారి, బాలాయపల్లి 8331057281
42 మండల వ్యవసాయ అధికారి, డక్కిలి,, 8331057283

వెబ్‌సైట్ URLలు/APPలు/కాల్ సెంటర్లు

  1. https://www.apagrisnet.gov.in/
  2. https://www.eseed.ap.gov.in/eseed/
  3. https://www.soilhealth.dac.gov.in/
  4. https://www.angrau.ac.in
  5. https://www.commodityonline.com/
  6. https://www.pmkisan.gov.in/
  7. https://www.pmfby.gov.in/
  8. https://www.pmksy.gov.in/
  9. https://www.enam.gov.in/
  10. https://www.isro.vassarlabs.com/forcast
  11. https://annadathasukhibhava.ap.gov.in/
  12. https://karshak.ap.gov.in/ecrop

 

సంబంధిత యాప్‌లు :

  1.  అగ్రి సెంట్రల్
  2. వ్యవసాయం            
  3. ప్లాంటిక్స్                  
  4. NPSS

కాల్ సెంటర్లు :

ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్: 155251

కిసాన్ కాల్ సెంటర్            : 1800-180-1551