ముగించు

ఏ.పి. మార్క్ ఫెడ్ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య లిమిటెడ్)

ప్రొఫైల్

             ఏ.పి.మార్కఫెడ్(అంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య లిమిటెడ్.) తిరుపతి  జిల్లా లోని సహకార సొసైటీల యొక్క సమాఖ్యగా జిల్లాలోని రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడం మరియు వారికి అవసరమగు నాణ్యత తో కూడిన ఎరువులను సరఫరా చేయు ముఖ్య ఉద్దేశ్యo తోటి ఏర్పాటు చేయబడినది. దీనికి తగిన విధంగా ప్రస్తుతం మార్క్ ఫెడ్ ఎరువుల నిల్వలను సమకూర్చుకొనుచు రైతులకు అవసరమగు ఎరువులు సరఫరా చేయచున్నది మరియు రైతుల వద్ద నుండి సొసైటీల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధరపై కొనుగోలు చేయచున్నది.

సభ్యసంస్థలు

              ప్రస్తుతము తిరుపతి జిల్లాలో 61 ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు  సొసైటీ సభ్యులుగా ఉన్నయి. ఇవి రైతులకు అవసరమగు ఎరువులు, సూక్ష్మపోషకాలను అందించడం మరియు రైతుల యొక్క ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తున్నాయి. ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు యొక్క కార్యకలాపాల లావాదేవీలు జిల్లా సహకార బ్యాంకు నిర్వహిస్తుంది.

సంస్థ నిర్మాణ క్రమము

 

a

 

పథకాలు/కార్యకలాపాలు/కార్యప్రణాళిక

ఎరువులు పంపిణి 

              ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలకు, ప్రైవేటు డీలర్లకు మరియు ప్రభుత్వ సంస్థలకు ఏ.పి.మార్క్ ఫెడ్ ,తిరుపతి వివిధ రకాలైన ఎరువులను(యూరియా,డి.ఎ.పి మరియు ఇతర కాంప్లెక్స్ ఎరువులు) పంపిణి చేస్తుంది.

వ్యవసాయ ఉత్పత్తులసేకరణ       

            ఏ.పి మార్క్‌ఫెడ్ పప్పుధాన్యాలు (శనగలు,మినుములు మరియు పెసలు ను) నూనె గింజలు (వెరుశనగ)మరియు ముతక ధాన్యాల (మొక్కజొన్న, జొన్న మరియు సజ్జలు) సేకరణకు రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా ఉంది. రైతుల ఉత్పత్తులను క కనీస మద్దతు ధరతో వారి వద్ద నుంచి నేరుగా కొనుగోలు చేయడం  ద్వారా రైతులకు  నష్టాల విక్రయాలను నివారించడం. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు AP మార్క్‌ఫెడ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఎండు మిర్చి మరియు పసుపు వంటి పంటలను కూడా కొనుగోలు చేస్తుంది.

సంప్రదించవలసిన అధికారి వారి వివరాలు

.సంఖ్య

పేరు & స్థాయి

ఫోన్ నెంబర్

1

శ్రీ ఎస్.పవన్ కుమార్,జిల్లా మేనేజర్

8978381842

2

శ్రీ పి మౌలాలి,అకౌంటెంట్

8919633604

3

శ్రీ ఓ మురళి,కంప్యూటర్ ఆపరేటర్/అటెండర్

7207099883

ఈ-మెయిల్/పోస్టల్ అడ్రస్

     ఈ-మెయిల్ ఐ.డి   : tirupathi[dot]apmarkfed[at]gmail[dot]com

     చిరునామా               : అంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య లిమిటెడ్,

                                         జిల్లా కార్యాలయము  రూమ్  నెం.402 & 403,4 వ అంతస్తు బి బ్లాక్ పద్మావతి నిలయం,

                                         తిరుచానూర్ రోడ్డు ,  తిరుపతి నెల్లూరు జిల్లా-517501

ముఖ్యమైన వెబ్ సైట్లు

                                        www.apmarkfed.ap.gov.in